మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసిన నారా లోకేష్ || Oneindia Telugu

2019-07-17 313

Former TDP Minister Nara Lokesh has once again criticized Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy as a tweeter.Opposition Party on ruling Party, ruling Party on Opposition Party Twitter w@r is no longer cool
#appolitics
#ysrcp
#tdp
#lokesh
#vijayasaireddy
#amaravathi
#chandrababu
#jagan
#assembly

ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం, అసెంబ్లీ బయట ట్విట్టర్ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఏపిలో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ యుద్దం ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీపై అదికార పార్టీ ట్విట్టర్ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ట్వీట్టర్ వేదికగా టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ మరోమారు విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్.. అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికలలో ఓటమి తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్న టీడీపీ జనరల్ సెక్రెటరీ మరియు మాజీ మంత్రి నారా లోకేష్..కొద్ది రోజుల తర్వాత ట్విట్టర్ వేదికగా..విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు అని లోకేష్ అన్నారు.

Videos similaires